నేరాల నియంత్రణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు సహకరించాలి

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

నస్పూర్‌: నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్‌ అన్నారు. మంచిర్యాల నగరంలోని సోనియనగర్‌, శ్యామ్‌నగర్‌ కాలనీ ప్రజలతో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. 50 మంది ప్రత్యేక పోలీస్‌ బలగాలతో ఆకస్మిక తనిఖీలు చేశారు. నంబర్‌ ప్లేట్‌ లేని 60 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలకు జరిమానా విధించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. అనంతరం కాలనీ ప్రజలతో ఏసీపీ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ప్రయాణాలు చేసేవారు ఇళ్లలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచకూడదని తెలిపారు. ప్రధాన చౌరస్తాలు, ఇళ్ల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు ప్రశాంత్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement