మంచిర్యాలటౌన్: భారతీయ వైద్య విధానం ప్రపంచానికి ఆదర్శమని, హోమియో వైద్యంతో చక్కని ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీళ్లనొప్పులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హోమియోపతి, న్యాచురోపతి, యోగ వంటి విధానాల ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ వేదవ్యాస్, ఆర్‌ఎంవోలు భీష్మ, శ్రీమన్నారాయణ, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, సునిల్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, శంకర్, లింగారెడ్డి పాల్గొన్నారు.
పుష్కరాలకు ఏర్పాట్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని రహదారులు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్, సీఆర్‌ఎస్, ఎండీడీజీఆర్‌డీసీ అధికారి మోహన్‌నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యలతో కలిసి దేవాదాయ, నీటిపారుదల మున్సి పల్, విద్యుత్ శాఖల అధికారులతో పుష్కర ఏర్పాట్లకు బడ్జెట్ కేటాయింపుపై సమావేశం నిర్వహించా రు. ఆలయాల అభివృద్ధికి నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించా రు. జిల్లాలో పుష్కర ఘాట్లకు చేరుకునే రహదారుల మరమ్మతు పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గోదావరి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.


