జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో రాష్ట్ర ఉప విద్యుత్ తనిఖీ అధికారి ఏ.రాజు శుక్రవారం పర్యటించారు. ఎస్టీపీపీ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800మెగావాట్ల కొత్త ప్లాంటులో విద్యుత్ పనులు పరిశీలించి సూచనలు చేశారు. పనుల్లో జాప్యం లేకుండా అధికారులు చేపడుతున్న చర్యలు వివరించారు. తొలిసారిగా ప్లాంటుకు వచ్చిన ఆయనను స్థానిక ప్రాణహిత అతిథి గృహంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) కిరణ్‌బాబు, ఎస్‌ఈ(ఎలక్ట్రికల్) ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


