
భారీ వృక్షాలు నరికివేత
కై లాస్‌నగర్: పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఓ వైపు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటం అధికారుల నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాకేంద్రంలోని జగ్జీవన్ రాంచౌక్‌లో గల జెడ్పీ క్వార్టర్స్ వద్ద భారీగా పెరిగిన నీలగిరి, వేప వృక్షాలను నరికివేసి ట్రాక్టర్‌లో విక్రయానికి తరలించడం విస్మయానికి గురిచేసింది. ఏళ్లనాటి పెద్దపెద్ద చెట్లను నరికివేయడమేంటనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాల్టా చట్టాలు అమలు చేయాల్సిన అధికారులే ఉల్లంఘించడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై జెడ్పీ సిబ్బందిని సంప్రదించగా భారీగా పెరిగిన వృక్షాలు క్వార్టర్స్‌పై పడే ప్రమాదమున్నందున అధికారుల అనుమతితోనే నరికివేసినట్లు తెలిపారు.

భారీ వృక్షాలు నరికివేత