వేమనపల్లి: ఇటీవల కురిసిన కుండపోత వర్షానికి మండలంలో వరి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మండల కేంద్రంలోని రాజారాం శివారు నుంచి వచ్చిన వరదతో 250 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో పత్తి, కల్మలపేట, గొర్లపల్లి, కేతన్‌పల్లి, జాజులపేట, సుంపుటం, నీల్వాయి, దస్నాపూర్ శివారుల్లో పత్తి పంటలు వరదపాలయ్యాయి. నాగారాం, బుయ్యారం, మామిడిపల్లి, చామనపల్లి గ్రామాల్లో ఒర్రెలు, పెద్దవాగు ఉప్పొంగి 250 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మామడకు వెళ్లే ఒర్రైపె తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. మామిడిపల్లి, బొమ్మెన రూట్‌లో కల్వర్టు కొట్టుకుపోయింది. బుయ్యారం గ్రామ సమీపంలో ఉన్న పైపు కల్వర్టుపై కందకం ఏర్పడింది. చామనపల్లి వాగులో వరద పోటెత్తడంతో అసంపూర్తి వంతెన మునిగిపోయి ఇరువైపులా ఒడ్డు కోతకు గురైంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి గ్రామపంచాయతీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వర్షార్పణం
వర్షార్పణం