
రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు
తాండూర్: గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి యువకుడు గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తపల్లి వారసంత సమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలులో హైదరాబాద్‌కు చెందిన మహేశ్ జారిపడటంతో గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లే క్రమంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని యువకుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తాండూర్ పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. 108 ఈఎంటీ ప్రశాంత్, పైలెట్ అన్నం తిరుపతి ఉన్నారు.