ఏజెన్సీ గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు
తాండూర్: ఏజెన్సీ గ్రామాల సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం మండలంలోని రేచి నీ గ్రామ పంచాయతీ పరిధి గజ్జలపల్లి, తోటిగూడ గ్రామాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం సందర్శించారు. పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహా రం పంపిణీ సరిగా జరగడం లేదని ఫిర్యాదు రావడంతో అంగన్‌వాడీ టీచర్‌పై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి స మస్య సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీవో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కిష్టంపేట గ్రామస్తులు, నర్సాపూర్ పరిధిలోని రెండు చెరువుల్లో పూడిక తీత తీయించాలని, గ్రామ శివారులో ని రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నాయకులు విన్నవించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులను పీవో ఆదేశించారు. తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


