సదాశివకు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సదాశివకు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

Jan 5 2026 11:29 AM | Updated on Jan 5 2026 11:29 AM

సదాశివకు ఆంధ్రశ్రీ   పూర్ణకుంభ పురస్కారం

సదాశివకు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

ఆదిలాబాద్‌: తెలంగాణ సాహితీ దిగ్గజం సామల సదాశివ మాస్టార్‌ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపునిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సారస్వత పరిషత్‌ ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం ప్రదానం చేసింది. మరణానంతరం ఆయన గౌరవార్థం ప్రకటించింది. గుంటూరు జిల్లా అమరావతిలోని ఎన్టీ రామారావు ప్రాంగణంలో ఈనెల 3 నుంచి నిర్వహిస్తున్న తెలుగు మహాసభల్లో శనివారం రాత్రి మాస్టార్‌ కుమారులు రాజవర్ధన్‌, శ్రీవర్ధన్‌, చంద్రశేఖర్‌ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుని చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సభలో ఆంధ్ర సరస్వత పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement