దివ్యాంగుల చట్టం అమలు చేయాలి
పాతమంచిర్యాల: దివ్యాంగుల చట్టం–2016 పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్) జాతీ య నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను దూషించినా, వారిపై దాడి చేసినా కేసులు నమోదు చేయాలని కోరారు. దివ్యాంగుల కోసం అన్ని పోలీస్‌స్టేషన్లలో వీల్‌చైర్‌లు అందుబాటులో ఉంచాలని, ర్యాంపులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో వికలాంగుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ జాతీయ కన్వీనర్ బీవీ.అప్పారావు, నాయకులు ఇందూరి రమేష్, కంచర్ల సదానందం, దుర్శెట్టి లక్ష్మణ్, మడావి షేక్‌రావు పాల్గొన్నారు.


