పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో తనిఖీ
చెన్నూర్‌రూరల్: మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామ పీహెచ్‌సీని జిల్లా వైద్యాధికారి అని త మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిష్టర్లు, మందుల నిల్వలు పరిశీలించా రు. పాము, కుక్కకాటుకు మందులు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఉన్నందున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల ని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవా లు ఎక్కువ జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. వైద్యుడు కృష్ణతేజ, సూపర్‌వైజర్లు కళావతి, మంగ బాలు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.


