‘‘ఉపాధి’లో కమీషన్లు రావనే కాంగ్రెస్ వ్యతిరేకం’
మంచిర్యాలటౌన్: ఉపాధిహామీ పథకం పనుల్లో కమీషన్లు రావనే ఉద్దేశ్యంతోనే వీబీ జీ రామ్ జీ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పథకం కింద పేదలకు మరిన్ని పనిదినాలు కల్పించి, ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో మోదీ నేతృత్వంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, గోలి రాము, వెరబెల్లి రవీందర్‌రావు, ముత్తె సత్తన్న, జోగుల శ్రీదేవి, కమలాకర్‌రావు, బియ్యాల సతీశ్‌రావు, మోటపలుకుల తిరుపతి, మాధవరపు వెంకటరమణ, రాపర్తి వెంకటేశ్వర్లు, అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, రంగ శ్రీశైలం, గడ్డం స్వామిరెడ్డి, బేతు రవి పాల్గొన్నారు.


