ఎంసీసీ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి
పాతమంచిర్యాల: ఎంసీసీ కార్మికులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, ఐఎఫ్‌టీయూ జనరల్ సెక్రెటరీ టి.శ్రీనివాస్ అన్నారు. ఎంసీసీ గేట్ ఎదుట నాలుగు రోజులుగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గురువారం వారు సందర్శించి మద్దతు తెలిపారు. ప్రతీ కార్మికునికి రూ.50 లక్షలు పరిహారం, ఇళ్ల నిర్మాణానికి రెండు గుంటల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌రావు, సతీష్‌రావు, అరెందుల శ్రీనివాస్, శివకృష్ణ కార్మికులు ఎస్.రాజయ్య, తిరుపతి, సురేందర్‌సింగ్, బాపయ్య, టి.రమేష్, రవీందర్, సంపత్, సతీష్, శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.
అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవాలి
నస్పూర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. నస్పూర్ బీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు బొంగోని శ్రీనివాస్ ఆయన సతీమణి శిరీష, పలువురు కార్యకర్తలు గురువారం రఘునాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కమలాకర్‌రావు, నాయకులు సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, పొన్నవేణ సదయ్య, సాంబశివరావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


