సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. గురువా రం కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం–2005పై ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమచార హక్కు చట్టం ఆవిర్భావం, లక్ష్యాలు, పౌరుల హక్కులు, అభ్యర్థన దాఖలు విధానం, రుసుం, కా లపరిమితులు, సమాచార మినహాయింపులు తది తర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, రిసోర్స్ పర్సన్ కిషన్, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.


