గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట/జైపూర్: గోదావరి నది పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని లక్సెట్టిపేట, ముల్కల్ల, మంచిర్యాల, జైపూర్ శివారులోని వేలాల గోదావరి పుష్కర ఘాట్లను హైదరాబాద్‌కు చెందిన ఈవై కన్సల్టెన్సీ సభ్యులు జయదీప్, తహరీమ్ బృందం బుధవారం పరిశీలించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే ఏర్పాట్లపై సమీక్షించింది. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై సర్వే నిర్వహించారు. పుష్కరఘాట్లతోపాటు భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, వసతులపై నివేదిక తయారు చేశారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ఆయా మండలాల తహసీల్దార్లు రఫతుల్లా, దిలీప్‌కుమార్, వనజారెడ్డి, లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, సర్పంచ్ డేగ స్వప్ననగేశ్ తదితరులు పాల్గొన్నారు.


