యూరియా కొరత లేకుండా నిల్వలు
చెన్నూర్/చెన్నూర్‌రూరల్: యూరియా కొరత లే కుండా నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడకుండా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం వారు చెన్నూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం, చేనేత ట్రెడర్స్, మండలంలోని అంగ్రాజ్‌పల్లి, ఆస్నాద గ్రామాల్లో ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా అవసరమున్న రైతులకు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, వాష్‌రూమ్‌ల నిర్మాణాలు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో యామిని, ఎంపీవో అజ్మత్‌అలీ, ఏఈవోలు పాల్గొన్నారు.


