సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి

Jan 7 2026 7:52 AM | Updated on Jan 7 2026 7:52 AM

సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి

సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి

జన్నారం: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగసభ, శతజయంతి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 3న తాండూర్‌లో ప్రారంభమైన కళాజాత మంగళవారం జన్నారానికి చేరింది. పాటలతో ర్యాలీ నిర్వహించా రు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, మండల కార్యదర్శి దాసరి తిరుపతి, నాయకులు ఖలీందర్‌ ఆలీఖాన్‌ , కొట్టే కిషన్‌రావు, లింగం రవి, కామెర దుర్గారాజ్‌, దేవి పోచన్న, చాడ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement