బెటాలియన్‌లో అట్టహాసంగా క్రీడా పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట 13 వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో మూడు రో జులపాటు నిర్వహించే బెటాలియన్ వార్షిక క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కమాండెంట్ పి.వెంకటరాములు క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అన్ని కంపెనీల పోలీస్ సి బ్బంది, అధికారులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని మైదానంలో కవాతు చేస్తూ కమాండెంట్ వెంకటరాములుకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం, మా నసిక ఉత్సాహంతోపాటు జట్టులో అంతా సమష్టి అనే భావన పెంపొందించడంలో కీల క పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వా రా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మెరుగుపడుతాయని తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్‌లు నాగేశ్వర్‌రావు, కాళిదాసు, బాల య్య, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్‌సింగ్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, బెటాలియ న్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


