మాతాశిశు ఆరోగ్య కేంద్రం తనిఖీ
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్, నియోనేటల్ కేర్, పాలిటివ్‌కేర్, కీమోథెరపి సెంటర్‌లను పరిశీలించారు. జిల్లాలో కీమోథెరపి కోసం ఎంతమంది రోగులు ఎదురు చూస్తున్నారు, క్యాన్సర్ రోగుల వివరాలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి శ్రీనివాస్, డీపీహెచ్‌ఎన్ పద్మ పాల్గొన్నారు.


