మౌలిక సదుపాయాలతో విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వసతిగృహాల్లోని ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులు తయారు చేసిన నూతన సంవత్సర గ్రీటింగ్‌కార్డులను కలెక్టర్, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాల నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, సంక్షేమ అధికారులు చాతరాజుల దుర్గప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.


