పింఛన్‌దారుల నిరసన
కాసిపేట: పింఛన్‌లో కోత విధించి చెల్లిస్తున్నారని మండలంలోని రొట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పింఛన్‌దారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ రూ. 2016 పింఛన్‌కు బదులు రూ.2వేలు, రూ.3016కు బదులు రూ.3వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. చిల్ల ర డబ్బుల విషయమై అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగగా రొట్టపల్లి గ్రామ పంచాయతీలో పింఛన్లు ఇవ్వనని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బీపీఎం వెళ్లిపోయారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.


