నాగోబా జాతర పనులు షురూ
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం ఈ నెల 18న మెస్రం వంశీయుల మహా పూజతో ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలతో పాటు జాతర నిర్వహణ, మర్రిచెట్టు, గోవడ్ పరిసర ప్రాంతాల్లోని పిచ్చిమొక్కలను బ్లేడ్ ట్రాక్టర్‌తో తొలగించారు. గోవడ్‌కు రంగులు వేయిస్తున్నారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందే ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు తెలిపారు.
నాగోబా జాతర పనులు షురూ


