ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి
జైనథ్: ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని త్రి దండి దేవనాథ్ రామానుజ జీయర్ స్వామి అ న్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వికాస తరంగణి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉండడంతో ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతం అని అంటారన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళల కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొంటాయన్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షుడు హనుమంతరావు, సభ్యులు రాజేశ్వర్, బాలకిషన్, సర్పంచ్ గడ్డం మమత జగదీ ష్, ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


