‘మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’

Jan 4 2026 7:05 AM | Updated on Jan 4 2026 7:05 AM

‘మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’

‘మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’

చెన్నూర్‌: మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, చెన్నూర్‌ మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఎంపీ ఎన్నికల్లో చెన్నూర్‌ మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధికంగా ఓట్లు వేశారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజే పీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్‌ స్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్‌, నాయకులు జాడి తిరుపతి, రాపర్తి వెంకటేశ్వర్‌, కొండపాక చారి, కమ్మల శ్రీనివాస్‌, ఏతం శివకృష్ణ, మానికరౌతు శంకర్‌, నాయకురాలు శ్రావణి, స్వరూప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement