సావిత్రీబాయి పూలే సేవలు మరువలేనివి
మంచిర్యాలఅగ్రికల్చర్: బాలిక విద్యకు కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావి త్రీబాయి పూలే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సావిత్రీబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా వి ద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి సావి త్రీబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పది మంది మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
మెనూ అమలు చేయాలి
జైపూర్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం మెనూ కచ్చితంగా అమలు చేయాల ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన సందర్శించారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి ఫణిబాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


