మద్యానికి బానిసై ఒకరు మృతి
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడలో మద్యానికి బానిసై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ముల్కల్లగూడకు చెందిన చంద్రశేఖర్ (35) చిన్ననాటి నుంచి అమ్మమ్మ భీమక్క వద్ద ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భీమక్క మృతి చెందింది. గతేడాది అతను ఉంటున్న ఇల్లు కూలిపోవడంతో సమీపంలో ఉన్న జీవన్‌రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడు. ఈ నెల 2 నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి సమీపంలో దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లిచూడగా మృతిచెంది కనిపించాడు. తిండి, నీరు లేక చనిపోయాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.


