
‘గిరిజన’ విద్యార్థుల సత్తా
నిర్మల్: నర్సాపూర్ (జి) మండలంలోని అంజనీతండాకు చెందిన రాథోడ్ విజయ–సంతోష్ దంపతుల కుమారుడు రాథోడ్ సతీశ్, చవాన్ సేపాబాయి–అంబాజీ దంపతుల కుమారుడు చవాన్ సుధీర్ కుమార్ శుక్రవారం వెలువడిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తా చాటారు. రాథోడ్ సతీశ్ 89.018 పర్సంటైల్ సాధించి ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 1,744 ర్యాంకు సాధించగా సుధీర్ కుమార్ 81.105 పర్సంటైల్ సాధించి ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 4,086 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సదరు విద్యార్థులను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.

‘గిరిజన’ విద్యార్థుల సత్తా