TS Mancherial Assembly Constituency: TS Election 2023: చిన్నయ్యకు తప్పని గండం..
Sakshi News home page

TS Election 2023: చిన్నయ్యకు తప్పని గండం..

Aug 27 2023 1:20 AM | Updated on Aug 27 2023 12:37 PM

- - Sakshi

మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంతమేరకు అసంతృప్తి ఉంది. టికెట్‌ రానప్పటికీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ పార్టీకే పని చేస్తానని చెబుతున్నారు. మూడు పర్యాయాలు టికెట్‌ ఆశించి భంగపడ్డారు. తప్పనిసరిగా టికెట్‌ వస్తుందనే ఆశ ఉన్నప్పటికీ రాకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తిలోనే ఉంది.

బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల నాయకుల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. మరోవైపు ఆరిజిన్‌ డెయిరీ సీఈవో శేజల్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోరాడుతోంది. ఆమె ప్రచారంలో పాల్గొంటే పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు నిఘా వర్గాలు ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు ఓ నివేదిక ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement