శ్రీరాంపూర్: సింగరేణిలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న సీసీసీ కార్నర్‌లో ‘సింగరేణి బకాయి.. బీజేపీ లడాయి’ పేరిట ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు తెలిపారు. శుక్రవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.55వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగుల జీతాలను యజమాన్యం ఓడీగా తెచ్చి ఇచ్చే పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో సింగరేణి నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులు పీ.కమలాకర్‌రావు, బేర సత్యనారాయణ, బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుర్రె చక్రి, నాయకులు పొన్నవేన సదానందం, ఆర్ శ్రీనివాస్, చిరంజీవి, గొల్ల మహేందర్, బొద్దున రమేశ్, రేణుక, శీరిష పాల్గొన్నారు.


