● వైభవంగా శోభాయాత్ర ● ప్రశాంతంగా నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

● వైభవంగా శోభాయాత్ర ● ప్రశాంతంగా నిమజ్జనం

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

● వైభవంగా శోభాయాత్ర ● ప్రశాంతంగా నిమజ్జనం

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రం మంచిర్యాలలో శుక్రవారం మహిళలు, యువతీ, యువకుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. వాడవాడలా వెలిసిన వినాయకుడిని నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి రాయపట్నం, మంచిర్యాల గోదావరి నదిలో ఉత్సవ విగ్రహాలను నిమజ్జనం చేశారు. స్థానిక లక్ష్మీనారాయణ మందిర్‌, విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐబీ చౌరస్తాలో విశ్వహిందు సమితి వేదిక వద్ద వినాయకుల శోభాయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. సరస్వతీ శిశుమందిర్‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వినాయకులు టీటీడీ కల్యాణ మండపం చౌరస్తా మీదుగా ఐబీ చౌరస్తా వేదిక వద్దకు చేరుకున్నాయి. బాణాసంచా కాలుస్తూ మంగళవాయిద్యాల మధ్య చిన్న విగ్రహాలను మంచిర్యాల గోదావరి నదికి తరలించారు. భారీ విగ్రహాలను రాయపట్నం గోదావరి నది వైపు నిమజ్జనానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పాత మంచిర్యాలలో పలు వినాయకులను దర్శించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన పూజా కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, మంచిర్యాల నగర మేయర్‌ ధర్ని మధుకర్‌, మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామగిరి భానేష్‌, చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అధ్యక్షుడు గుండ సుధాకర్‌, నగర పార్టీ అధ్యక్షుడు నరేష్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మహేష్‌, హిందు ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా డీసీపీ భాస్కర్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, మార్కెట్‌రోడ్‌లోని వినాయక భక్తజన గణేష్‌ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రోత్సవాల్లో పూజలందుకున్న లడ్డును వేలం వేశారు. తిరుపాల్‌రెడ్డి బ్రదర్స్‌ రూ.1,17,300, కలశంను ముత్తవరం శ్రీనివాస్‌ దక్కించుకున్నారు.

జైపూర్‌: పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాల సరిహద్దు గోదావరి బ్రిడ్జిపైన మూడో రోజున గణపతి నిమజ్జనం వైభవంగా సాగింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి గణనాథులను ఇందారం గోదావరి బ్రిడ్జిపై నుంచి నిమజ్జనం చేశారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సై భూమేశ్‌ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రధానంగా మంచిర్యాల నుంచి ఇందారం గోదావరికి నిమజ్జనం కోసం తరలించగా అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకు సందడి వాతావరణం నెలకొంది. నిమజ్జనాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ శుక్రవారం రాత్రి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement