పంటలకు ప్రాణం పోసిన వాన | - | Sakshi
Sakshi News home page

పంటలకు ప్రాణం పోసిన వాన

Sep 26 2026 12:08 AM | Updated on Sep 26 2026 12:08 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో వేసవిని తలపించగా.. మూడు రోజులుగా కురుస్తున్న వాన ప్రజలకు ఉపశమనం కలిగించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి వర్షం కురుస్తోంది. బుధ, గురువారాల్లో 34.6, శుక్రవారం 11.9మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. పత్తి గూడ, వరి పొట్ట దశలో ఉంది. ప్రస్తుతం వరిలో కలుపు, ఎరువులు వేస్తున్నారు. పంట పొలాల్లో నీరు నిల్వడంతో మరో 15రోజుల వరకు నీటితడులకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు రోజులు..

మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత వర్షాలు ఊరటనిస్తున్నా ఇలాగే మరో రెండ్రోజులు కొనసాగితే పత్తి పంటలో పూత, గూడ రాలిపోతుంది. చేన్లు జౌకపట్టి పత్తి చెట్లు రంగు మారుతాయని రైతులు తెలిపారు. శుక్రవారం జన్నారం మండలంలో 47.9 మిల్లీమీటర్లు, దండేపల్లిలో 44.2, లక్షెట్టిపేటలో 22.6, హాజీపూర్‌లో 20.4 మిల్లీమీటర్ల వర్షం కురువగా.. నస్పూర్‌, నెన్నెల, కన్నెపల్లి, చెన్నూర్‌, భీమారం, భీమిని, కాసిపేట, తాండూర్‌, బెల్లంపల్లి, మందమర్రి, జైపూర్‌, కోటపల్లి, మంచిర్యాల, వేమనపల్లి మండలాల్లో 1మిల్లీమీటరు నుంచి 13.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటివరకు 920.8మిల్లీమీటర్లు కాగా 947మిల్లీమీటర్లు కురిసింది. సగటున 3శాతం అధికంగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement