breaking news
chinnaiah
-
TS Election 2023: చిన్నయ్యకు తప్పని గండం..
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంతమేరకు అసంతృప్తి ఉంది. టికెట్ రానప్పటికీ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పార్టీకే పని చేస్తానని చెబుతున్నారు. మూడు పర్యాయాలు టికెట్ ఆశించి భంగపడ్డారు. తప్పనిసరిగా టికెట్ వస్తుందనే ఆశ ఉన్నప్పటికీ రాకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తిలోనే ఉంది. బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల నాయకుల్లో ఒకింత వ్యతిరేకత ఉంది. మరోవైపు ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోరాడుతోంది. ఆమె ప్రచారంలో పాల్గొంటే పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు నిఘా వర్గాలు ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు ఓ నివేదిక ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పాపం.. పసిప్రాణం..!
సారంగాపూర్, న్యూస్‌లైన్ : బీరవెల్లి గ్రామానికి చెందిన బాలేరు సాయన్న వివాహం భైం సా మండలం కోతుల్‌గామ్‌కు చెందిన సరిత తో మూడేళ్ల క్రితం జరిగింది. వీరికి పది నెల ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. సాయన్నది ఉమ్మడి కుటుంబం. మూడు నెలల నుం చి ఇంట్లో గొడవలు జరుగుతున్నారుు. దీంతో అమ్మానాన్నలతో విడిపోరుు సాయన్న తన కుటుంబంతో అదే ఇంట్లో వేరుగా ఉంటున్నా డు. సోమవారం సాయంత్రం ఆస్తిపంపకం విషయమై సాయన్నకు, అతడి తల్లిదండ్రులు గట్టవ్వ, దేవన్నలకు మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన సాయన్న కుమారుడు యశ్వంత్‌ను తీసుకుని రాత్రి బయటకు వెళ్లాడు. గ్రామంలో బాలుడికి తినుబండారా లు కొనిచ్చాడు. అర్ధరాత్రి దాటినా సాయన్న తిరిగి రాకపోవడంతో తండ్రీకొడుకు కోసం కుటుంబ సభ్యులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. బంధువులకు ఫోన్ చేసినా ఫలి తం లేకపోరుుంది. మంగళవారం ఉదయం సాయన్న సోదరుడు చిన్నయ్య తమ పసుపు చేను వద్దకు వెళ్లగా యశ్వంత్ మృతదేహం కనిపించింది. వెంటనే అతడు ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా అ క్కడికి చేరుకున్నారు. కొడుకు మృతదేహం వద్ద సరిత గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయన్న జాడ తెలి యకపోవడంతో యశ్వంత్ మృతికి కారణా లు తెలియరాలేదు. సర్పంచ్ ఎల్లన్న, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పోలీసులకు సమాచార మందించారు. నిర్మల్ రూరల్ సీఐ రఘు, రూ రల్ ఎస్సై నర్సింహారెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, వీ ఆర్వో గణపతిరెడ్డి, ఏఎస్సైలు నవాబ్జానీ, భూమన్న మృతదేహాన్ని పరిశీలించారు. చలే బలిగొందా..? బాలుడి మృతదేహంపై ఎలాంటి గాయూల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. సాయ న్న కుమారుడిని తనతోపాటు చేనులో పడుకోబెట్టుకోవడంతో చలితీవ్రత భరించలేక బా లుడు చనిపోరుు ఉంటాడని, కొడుకు మృతి విషయం తెలిసి సాయన్న పారిపోరుు ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో సాయన్న తన చేను వద్దకు వెళ్తుండగా చూశామని, ఆ తర్వాత అతడు కనిపించలేదని కొందరు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నిర్మల్ ఏరియూ ఆస్పత్రికి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
టమాటాల మాటున కలప రవాణా
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : మండలంలోని సిరిచెల్మ చౌరస్తా బైపాస్ రోడ్డుపై టమాటాల మాటున అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. అటవీ అధికారుల కథనం ప్రకారం.. సిరిచెల్మ వైపు నుంచి టమాటాలు తరలిస్తున్న వాహనంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ మేరకు అటవీ సిబ్బంది బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని జాతీయ రహదారిపైకి ఎక్కించి పరారవడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని అడ్డగించారు. దీంతో వాహనం దిగి స్మగ్లర్లు పారిపోయారు. పట్టుకున్న వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అందులోని కలప విలువ రూ.లక్ష వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చిన్నయ్య, అహ్మద్‌ఖాన్, ఆత్రం సుందర్ పాల్గొన్నారు.