ధన్వాడ: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలోని రెజ్లింగ్ భవనంలో సోమ వారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెజ్లింగ్ కోచింగ్ క్యాంప్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ రాచంద్రయ్య ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి రెజ్లింగ్ క్రీడాకారిణులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. క్రీడాకారిణులు శిక్షణలో నైపుణ్యాలు నేర్చుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింలు, ప్రత్యేక అధికారి కల్పన, పీడీలు సాయినాథ్, అనంతసేన, వెంకటప్ప, పీఈటీ సౌమ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


