జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో నిర్వహించనున్న ఖేలో ఇండియా కబడ్డీ పోటీల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సోమవారం కలెక్టరేట్‌లోని వీసీహాల్‌లో డీఆర్‌ఓ నిర్మలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన వేదిక, మౌలిక సదుపాయాలు, విద్యుత్, భద్రత ఏర్పాట్లపై ఏలోటు లేకుండా నిర్వహించాలన్నారు. క్రీడాపోటీలు సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రీడాకారులు మరియు అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.


