అమరచింత: పేదల తిరుపతిగా పేరుగాంచి భక్తుల చేత పూజలందుకుంటున్న శ్రీకురుమూర్తి స్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు అమరచింత పద్మశాలి కులస్తులు నేత పనులను ప్రారంభించారు. పట్టణంలోని భక్తమార్కండేయ ఆలయంలోని పంక్షన్ హాల్‌లో ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేశారు. పట్టువస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడిసరుకును నేతకోసం అతికిస్తున్నారు. దీపావళి పర్వదినం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం పట్టు వస్త్రాల తయారీ కార్యక్రమ పనులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 14న జరిగే అలంకరణోత్సవంలో పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమరచింతకు చెందిన పద్మశాలీ కులస్తులు ఆనాదిగా వస్తున్న ఆనవాయితీని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నట్లు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రఘురాం, కౌన్సిలర్ మేర్వరాజు తెలిపారు.


