అండగా ఉంటాడకున్న కొడుకు అకాల మృతి | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాడకున్న కొడుకు అకాల మృతి

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

తిమ్మాజిపేట: తమను పోషిస్తూ ఆసరాగా ఉంటాడునుకున్న కన్న కొడు కు రోడ్డు ప్రమాదంలో అ కాల మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండె పగిలింది. మండలంలోని చే గుంట గ్రామానికి చెందిన గడ్డం గోవిందమ్మ, వెంకటయ్య దంపతుల పెద్ద కుమారుడు గడ్డం మహేష్‌ (26) ఆదివారం అచ్చంపేట సమీపంలోని చెన్నారం గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉన్న మహేష్‌ మృతి ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు సైతం కూలీ పనులే చేస్తూ జీవనం సాగిస్తూ.. చిన్న కుమారుడిని చదివిస్తున్నారు. మహేష్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్‌ కిల్లె మల్లయ్య, వార్డు సభ్యులు, యువకులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లి కడసారి చూసి వచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

నిలిచిన లారీని ఢీకొట్టి దుర్మరణం

ఉండవెల్లి: మండలంలో ని జాతీయ రహదారిపై ఉండవెల్లి శివారులోని రైల్వే హైలెవల్‌ బ్రిడ్జ్‌పై నిలిచిన కంటైనర్‌ లారీని బైక్‌పై వెళ్తూ ఢీ కొట్టి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అలంపూర్‌ మండలం కాశాపురం గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు(40) బైక్‌పై ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని తన అక్క వద్దకు వెళ్తుండగా.. ఉండవెల్లి శివారులోని రైల్వే హైలెవల్‌ వంతెనపై కంటైనర్‌ లారీ ఇంజిన్‌ చెడిపోవడంతో డ్రైవర్‌ నిలిపా డు. అయితే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వెనుకనుంచి ఢీ కొట్టి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతు డి తల్లి ఉషనమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైవేపై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోవడంతో పోలీసులు నివారించారు.

పట్టపగలే ఇంట్లో చోరీ

మరికల్‌: పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమ వారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కు టుంబ సభ్యులు తె లిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెంటమీది ఎల్లప్ప కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్‌ ఇంటిని పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీమ్‌ ద్వారా వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చిరుత కలకలం

కొత్తపల్లి: చిరుత దాడిలో మేక మృతి చెందిన ఘటన నారాయణ పేట జిల్లా కొత్తపల్లి మండలంలోని బోడబండతండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తండాకు చెందిన పాండునాయక్‌ తండాకు సమీపంలోని గుట్టల్లో మేత కోసం తన భార్యను పంపించాడు. సాయంత్రం వేళ ఇంటికి వస్తుండగా చిరుత దాడిచేసి మేకను ఎత్తుకెళ్లింది. ఈ విషయం సంబంధిత అటవీశాఖ అధికారి లక్ష్మణ్‌కు సమాచారం అందించగా.. సోమవారం గుట్టల్లో వెళ్లి వెతకగా.. మేక కళేబరం కనిపించిందని, ఈ కళేబరం మేకదేనని ఈ మేకపై చిరుత దాడిచేసి తిన్నట్లు ధ్రువీకరించారు. ఈ ప్రదేశంలో గతకొన్ని నెలలుగా గుట్ట ప్రాంతంలోనే తిరుగుతుందని సంబంధిత అదికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని బాధితుడు పాండునాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోనే కొన్ని రోజుల నుంచి రెండు మేకలు, మూడు కుక్కలను కూడా తిన్నట్లు తెలిపారు. దీంతో గుట్ట పరిసర ప్రాంతతండా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై పై అధికారులకు తెలియజేస్తానని అటవీశాఖ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement