రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

వెల్దండ: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెల్దండ మండలం పెద్దాపూర్‌ గేట్‌ సమీపంలో సోమవా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామానికి చెందిన బెటర్‌ వెంకటేష్‌ (28) హైదరాబాద్‌లో పాల ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పెద్దాపూర్‌ గేట్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడి వాహనాన్ని ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత మరో వాహనం ఢీకొనడంతో వెంకటేష్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 108 అంబులెన్స్‌లో మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు రెండేళ్ల క్రితం సిర్సవాడకు చెందిన పద్మతో వివాహమైంది. వీరికి ఆరు నెలల పాప ఉంది. కుటుంబానికి ఆధారమైన వెంకటేష్‌ మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ–పీజీ కళాశాలలో ఈ ఏడాది మిగిలిపోయిన పీజీ కోర్సులలో సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు తీసుకుంటున్నా మని ప్రిన్సిపాల్‌ కె.పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీ సీపీజీఈటీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement