జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాజీ సైనికుల కోసం ఈనెల 5న జిల్లా కేంద్రంలోని రాజబహదూర్ ఫంక్షన్‌హాల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ సైనికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మనస్తాపంతో బలవన్మరణం
తెలకపల్లి: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. మండలంలోని రాకొండకు చెందిన జర్పటి శంకర్ (28) గతనెల 25 ఇంట్లో నుంచి వెళ్లిపోయి మిస్సింగ్ కింద కేసు నమోదైంది. మళ్లీ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంటినుంచి తెలకపల్లికి పోయి వస్తానని భార్య వరలక్ష్మికి చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. మృతుడు శేఖర్ అన్న నగేష్‌తో బతకాలనిలేదని చనిపోతున్నానని ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెతకగా తెలకపల్లి శివారులోని వెంచర్‌లో వేపచేట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడు భార్యాభర్తల సంసార విషయంలో గొడవలు జరిగాయని, మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


