రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రన్నరప్‌గా పాలమూరు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రన్నరప్‌గా పాలమూరు

Nov 3 2026 1:39 AM | Updated on Nov 3 2026 1:39 AM

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో రెండ్రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి 12వ తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2026 జూనియర్‌ ఇంటర్‌ బాలికల పోటీలు సోమవారం ముగిసాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 21జట్లు పాల్గొన్నాయి. 450 మంది క్రీడాకారులు హాజర య్యారు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జట్లు ఫైనల్‌కు చేరుకోగా పోరు హోరాహోరీగా సాగింది. నిజామాబాద్‌ జట్టు 6–5 పాయింట్ల తేడాతో విజేతగా నిలువగా.. మహబూబ్‌నగర్‌ ద్వితీయ, సిద్దిపేట తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. విజేతలకు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఇండియా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ శోభన్‌బాబు, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు పోశెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ కప్‌లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement