● హ్యాట్రిక్ విజయాలతో దూకుడు
● హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జట్లు సైతం సెమీస్‌కు..
● నేడు ముగియనున్న ఎస్‌జీఎఫ్
అండర్–19 క్రికెట్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో 70వ స్కూల్ గేమ్స ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు అద్వితీయమైన ప్రతి భ కనబరుస్తోంది. వరుసగా మూడు విజయా లు సాధించి సెమీఫైనల్‌కు చేరింది.అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి. ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర క్రికె ట్ టోర్నీ నేడు (మంగళవారం) ముగియనుంది.
క్రికెట్‌లో జాతీయస్థాయికి ఎదగాలి
ఎండీసీఏ మైదానంలో సోమవారం రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌ను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. క్రికెట్‌లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని కోరారు. ప్రతిభచాటి జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాల్‌రాజు, రాఘవేందర్, నాగరాజు, అరుణజ్యోతి, స్వప్న, మధు, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు.
15 పరుగుల తేడాతో మెదక్ విజయం
పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మెదక్ 15 పరుగుల తేడాతో కరీంనగర్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
రంగారెడ్డి భారీ గెలుపు
రంగారెడ్డి జట్టు 71 పరుగుల తేడాతో ఆదిలాబాద్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి 14.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సాయి చౌదరి 24 బంతుల్లో 41 పరుగులు, సుధాంష్ 15 బంతుల్లో 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. రంగారెడ్డి బౌలర్ హర్షవర్ధన్ 3 వికెట్లు తీశాడు.
నేటి సెమీఫైనల్ మ్యాచ్‌లు
మహబూబ్‌నగర్ x మెదక్
హైదరాబాద్ x రంగారెడ్డి
మహబూబ్‌నగర్ జట్టు టోర్నమెంట్‌లో వరుస విజయలతో దూసుకెళుతోంది. నగర శివారు లోని (అల్లీపురం సమీపం)లోని మైదా నంలో సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఖమ్మంపై గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ నిర్ణీ త 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. జట్టులో మరోసారి బీరేందర్ 25 బంతుల్లో 35 పరుగులు, సిద్దార్థ 17 బంతుల్లో 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. జట్టులో ఉన్నత్ 30 పరుగులు చేశాడు. సిద్ధార్థ 3, ఫైజాన్ 2 వికెట్లు తీశారు.


