జడ్చర్ల టౌన్: సదాశివపేట ఓక్వెస్ యూనివర్సిటీలో ఈనెల 14నుంచి జరగనున్న 20వ జాతీయస్థాయి అంతర్ జిల్లాల పోటీలకు మండలంలోని కోడ్గల్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ముడావత్ శివకుమార్ ఎంపికై నట్లు హెచ్ఎం శ్రీనివాసులు సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 60మీటర్ల రన్నింగ్, 5మీటర్ల అప్రోచ్ రన్ లాంగ్‌జంప్, సీజర్కట్హై జంప్ మూ డు ఈవెంట్లలోనూ ప్రథమస్థానం దక్కించుకున్నా డు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నందుకు సో మవారం పాఠశాలలో పీడీ రవికుమార్‌గౌడ్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.


