నేటినుంచి మండల స్థాయిలో ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి మండల స్థాయిలో ప్రజావాణి

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలోని ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నుంచి మండల మండల స్థాయి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ప్రజావాణిలో అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నందున తమ సమస్యలు, వినతులు సమర్పించేందుకు జిల్లాకేంద్రానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోయిల్‌సాగర్‌లో

18 అడుగుల నీటిమట్టం

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 18 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి ఒక పంపు ద్వారా కోయిల్‌సాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. మరో 8.8 అడుగుల నీరు చేరితే పాత అలుగు లెవల్‌ అవుతుంది. గేట్ల స్థాయి నీటిమట్టం 32.6 అడుగులుగా ఉంది.

తీజ్‌ సంబరాలు

ఆకట్టుకున్న యువతుల

సంప్రదాయ నృత్యాలు

మొలకల బుట్టలతో భారీ ఊరేగింపు

గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు

– వివరాలు 8లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement