మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ సైక్లింగ్ క్లబ్ (ఎంసీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీడమ్ రైడ్ ఉత్సాహంగా జరిగింది. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని ముఖ్య అతిథిగా హాజరై సైక్లింగ్ రైడ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ఈ సైక్లింగ్ రైడ్ పద్మావతీకాలనీ మీదుగా పిస్తా హౌజ్ వరకు వెళ్లి.. తిరిగి అక్కడి నుంచి మెయిన్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రైడ్‌లో దాదాపు వందమందికిపైగా పాల్గొన్నారు. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించే దిశగా ఈ రైడ్ నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.


