చదువుతోనే ఉత్తమ భవిష్యత్‌ సాధ్యం | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే ఉత్తమ భవిష్యత్‌ సాధ్యం

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

కొల్లాపూర్‌ రూరల్‌: ప్రతి విద్యార్థి చదువుతో తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చనిత ప్రపంచ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ క మిషన్‌ మెంబర్‌ డాక్టర్‌ వాజీత్‌పాషా అన్నారు. ఆదివారం తన సొంత గ్రామమైన కొల్లాపూర్‌ మండలం సోమశిలలోని ప్రాథమిక పాఠశాలకు రూ.1.50 లక్షలు విలువైన ఏఐ ప్యానల్‌ బోర్డును వితరణ చేశారు. ఈ ప్యానల్‌ బోర్డును మండల విద్యాధికారి ఇమ్మానుయేలు, గ్రామ సర్పంచ్‌ వెంకటలక్ష్మితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి పాఠశాలలో ఏఐ ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌ వస్తే ప్రపంచం మొత్తం తిరగవచ్చన్నారు. తాను సోమశిలలో చదువుకొని అమెరికాలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నానని తన లాగానే గ్రామీణ విద్యార్థులు ఎదగాలని సూచించారు. మండల విద్యాధికారి ఇమ్మానుయేలు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను రోజు పాఠశాలకు పంపించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, వెంకటస్వామి, తిరుపాలు, చిన్నకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement