క్యూఆర్ కోడ్‌తో ఎరువులు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం) /నవాబుపేట: ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం నూతన డిజిట ల్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రైతులకు పారదర్శకంగా,అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్ ద్వారా సోమవారం (ఆగస్టు 17) నుంచి ఎరువుల విక్రయాలు చేపట్టనున్నారు. ఇక రైతులు ఎరువుల కోసం విక్రయ కేంద్రాల వద్ద క్యూలో నిలబడకుండా ముందుగానే యాప్‌లో నమోదు చేసుకుని అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్‌తో లాగిన్..
రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలి. ఫార్మర్ ఐడీ ఉన్నవారు దానితో లేదా ఆధార్ నంబర్‌తో లాగిన్ కావచ్చు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఫార్మర్ ఐడీ లేని రైతులు ఆధార్‌తో ఈ–కేవైసీ పూర్తి చేసి యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.
భూమి వివరాలు లేకుంటే..
ఫార్మర్ రిజిస్ట్రీలో భూమి వివరాలు కనిపించకపోతే యాప్‌లోని ‘సింక్ ల్యాండ్స్ విత్ ఫార్మర్ రిజిస్ట్రీ’ ద్వారా వాటిని సమకాలీకరించుకోవచ్చు. అయినప్పటికీ వివరాలు అందుబాటులోకి రాకపోతే ‘యాడ్/క్లెయిమ్ ల్యాండ్’ ద్వారా భూమి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది.
రైతులకు అవగాహన
కల్పిస్తున్న అధి కారులు
యాప్ వినియోగంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు అందుబాటులో ఉండనున్నారు. రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాల వద్ద యాప్ డౌన్‌లోడ్, నమోదు, వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. రైతులు ఫార్మర్ ఐడీ, ఆధార్, మొబైల్ నంబర్, భూమి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
యాప్‌లో రైతుల భూమి వివరాలు అందుబా టులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సీజన్‌లో సాగు చేస్తున్న పంటను నమోదు చేయాలి. భూమి విస్తీర్ణం, పంట ఆధారంగా అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసుకోవాలి. దీనికి అనుగుణంగా జనరల్ ఫర్టిలైజర్ రికమండేషన్ (జీఎఫ్‌ఆర్)ను యాప్ చూపిస్తుంది. రైతు సాగు చేస్తున్న పంట, భూమి విస్తీర్ణానికి అనుగుణంగా సూచించిన పరిమాణంలోనే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరానికి మించి ఎరువులను బుక్ చేసుకోవడం సాధ్యం కాదు.
భూమి.. పంట వివరాలు తప్పనిసరి
రైతు తనకు అనుకూలమైన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్ చేసిన తర్వాత యాప్‌లో క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ అవుతాయి. వాటిని చూపించి విక్రయ కేంద్రం నుంచి ఎరువులు పొందవచ్చు. రైతు తరపున అధీకృత వ్యక్తి కూడా ఎరువులు తీసుకునే అవకాశం కల్పించారు.
నేటి నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం అమలు
ముందస్తు నమోదు తప్పని సరి..
భూమి, పంట వివరాల
ఆధారంగా కేటాయింపు
క్యూఆర్ కోడ్‌తో ఎరువులు పొందే అవకాశం


