ప్రథమ చికిత్స
అలంపూర్: పురుగు మందులన్నీ విష పదార్థాలు కావడంతో పంటలపై పిచికారీ చేసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటితో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కొన్ని సందర్భాల్లో పురుగు మందులు మానవ శరీరంలోకి మూడు విధాలుగా చేరడానికి అవకాశం ఉన్నట్లు వివరించారు. .
చర్మం ద్వారా : శరీరంపై పురుగు మందులు పడినప్పుడు చర్మం ద్వారా విష పదార్థం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నప్పుడు మరింత సులభంగా, త్వరగా ప్రశేశిస్తుంది.
ముక్కు ద్వారా : పురుగు మందుల ద్వారా వెలువడే వాయువులు, ధూళి అణువులు గాలిని పీల్చడం వల్ల ముక్కు ద్వారా శరీరంలోకి విష పదార్థాం ప్రవేశించి హాని కలిగిస్తోంది.
నోటి ద్వారా : పురుగు మందులను ముట్టుకున్నప్పుడు లేదా వాడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల, పురుగు మందులతో కలుషితమైన ఆహార పానీయాలు తీసుకోవడం వల్ల, పురుగు మందుల అవశేషాలు, పరిమితికి మించి ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల తెలిసి లేదా తెలియక పురుగు మందులు నోటి ద్వారా తీసుకోవడం వలన ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మరణం సంభవిస్తుంది.
ముక్కుతో పీల్చినప్పుడు విష పదార్థం శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్న లేక పూర్తిగా ఆగిపోయిన వెంటనే కృత్రిమ శ్వాస కల్పించాలి. వైద్యుని వద్దకు తీసుకెళ్లే వరకు కృత్రిమ శ్వాస అందిస్తు ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యక్తి ఎవరైనా తన నోటి ద్వారా అతని నోటిలోకి గాలిని ఊది సులభంగాను, శక్తి వంతంగాను ఊపిరిపోయొచ్చు.
● నోటి ద్వారా విష పదార్థం తీసుకున్నప్పుడు కడుపులో నుంచి బయటికి రావడానికి వెంటనే వాంతి చేయించాలి. గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు లేక ఆవాల పొడి కలిపి తాపించాలి. గొంతులో వేళ్లు పెట్టి కక్కించాలి. ఇలా పలుమార్లు చేయాలి. కడుపులోని పదార్థం ఖాళీ అయ్యేటట్లు చేయాలి. సాధరణంగా విష విరుగుడుకు వాడే పదార్థం తాగించాలి. 8 గ్రాముల చార్‌కోల్, 4 గ్రాముల ట్యానిక్ యాసిడ్, 4 గ్రాముల మెగ్నీషియం ఆకై ్సడ్ రసాయనాలను అర గ్లాసు వేడి నీళ్లలో కలిపి తాగించాలి. పాలు, గుడ్డులోని తెల్లసొన, జలటీన్, లేపనం ఇస్తే జీర్ణాశయం లోపలి భాగానికి హాని జరగదు. తర్వాత వైద్యుడిని సంప్రదిస్తే జీర్ణాశయం, చిన్న ప్రేగులు శుభ్రం అయ్యేలా చేస్తారు. అనంతరం చికిత్స అందిస్తారు.
పాడి–పంట
చర్మం ద్వారా విష పదార్ధం శరీరంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే శుభ్రమైన నీటితో సబ్బు ఉపయోగించి పలుమార్లు కడుక్కోవాలి. కంటిలో పడినప్పుడు కూడా శుభ్రమైన నీటిని అధికంగా ఉపయోగించి కడుక్కోవాలి. చికిత్స కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బట్టలపై పడినప్పుడు వెంటనే తీసేసి వాటిని ఉతికి శుభ్రం చేసిన తర్వాతనే ధరించాలి.


