ఎన్నికల సంఘం చేపట్టిన సర్ పక్రియలో ప్రజ లకు ఇబ్బందులు లేకుండా, పక్రియ త్వరగా పూర్తయ్యేందుకు డిగ్రీ కళాశాల విద్యార్థులను వాలంటీర్లుగా ఎంపిక చేశాం. వారికి ఫీల్డ్ విజిట్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగేలా కార్యక్రమం ఉపయోగపడింది. వాలంటీర్ల సాయంతో ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతుంది.
– మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
‘సర్’ ఎన్యూమరేషన్ ఫా రాలు నింపడంలో సహకా రం అందించడం మంచి అ నుభవాన్ని ఇచ్చింది. ఇచ్చి న గడువులోగా తప్పులు లేకుండా ఫామ్స్ పూర్తి చేస్తున్నాం. దీని ద్వారా కచ్చితమైన సమాచారా న్ని నమోదు చేయడం, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకున్నాను.
– శ్వేత, డిగ్రీ విద్యార్థిని, కల్వకుర్తి
సర్ ప్రకియలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలి.. తీసుకున్న ఫారాలను ఆన్‌లైన్‌లో ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలను దగ్గరుండి నేర్చు కున్నాను. బీఎల్‌ఓ విజయ్ మార్గదర్శకం వల్ల మా పని సులభంగా పూర్తిచేయగలిగాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మళ్లీ పాల్గొనే అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటాను.
– నందిని, డిగ్రీ విద్యార్థిని, కల్వకుర్తి


