ఆటోపై నుంచి పడి బాలుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆటోపై నుంచి పడి బాలుడి దుర్మరణం

Jul 22 2026 1:59 AM | Updated on Jul 22 2026 1:59 AM

మల్దకల్‌: పశువుల సంత కు ఆటోలో ప్రయాణిస్తు న్న ఓ బాలుడు పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని పెద్దపల్లి సమీపంలో మంగళవారం చో టుచేసుకుంది.గ్రామస్తుల కథనం ప్రకారం.. పాల్వాయికు చెందిన చాకలి చిన్న బీసన్న, శంకరమ్మ కుమారుడు రాకేష్‌(15) మంగళవారం మల్దక ల్‌లో జరిగే పశువుల సంతకు ఆటోలో గొర్రెల తో బయలుదేరాడు.ఆటోలో ప్రయాణిస్తున్న క్ర మంలో పెద్దపల్లి సమీపంలో ఆటోడ్రైవరు సడె న్‌ బ్రేక్‌ వేయడంతో ఆటోపై కూర్చు న్న రాకేష్‌ కింద పడిపోవడంతో బాలుడిపై అదే ఆటో వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంట నే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్న ఒక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.

ఫినాయిల్‌ తాగిన

వృద్ధురాలి మృతి

ధరూరు: బాత్‌ రూంలో ఫినాయిల్‌ తాగి మతిస్థిమితం లేని వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ర్యాలంపాడుకు చెందిన ఎంకమ్మ(80) నాలుగునెలల కిందట కిందపడి కాలు విరిగింది. అప్పటినుంచి ఇంట్లో మంచానికే పరిమితమైంది. వయసు పైబడటంతో ఆరోగ్యం క్షీణించడంతోపాటు మతిస్థిమితం కూడా లేక కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం కొడుకులు, కోడళ్లు పొలానికి వెళ్లారు. బాత్‌ రూంకు వెళ్లిన ఎంకమ్మ మతి సరిగా లేక బాత్‌ రూంలోని ఫినాయిల్‌ను తాగింది. అప్పటికే అపస్మారక స్థితిలో బాత్‌రూం వద్ద పడి ఉన్న వృద్ధురాలిని గమనించిన కుమారులు సాయంత్రం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. పోలీసులు దవాఖానకు వెళ్లి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ హుస్సేన్‌ తెలిపారు.

మహిళ ప్రాణం తీసిన

హీటర్‌

గట్టు: వేడి నీళ్ల కోసం హీట ర్‌ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గట్టుకు చెందిన రేణుక (24) అనే వివాహిత మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళి తే.. గట్టులోని వాకిలిగేరికి చెందిన రేణుక, రా మాంజనేయులు దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. రేణుక పెద్ద కుమార్తె నిఖిత ను తన దగ్గర పెట్టుకోగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను అదే కాలనీలో నాలుగిండ్లు అవతల ఉన్న తన అమ్మ దగ్గర ఉంచింది. ఈ క్రమంలో వేడి నీళ్ల కోసం హీటర్‌ను ఆన్‌చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. ఇంట్లోనే ఉన్న నిఖిత విషయాన్ని గమనించి బయటకు పరిగెత్తి కొద్దిదూరంలో ఉన్న అమ్మమ్మకు సమాచారం ఇచ్చింది. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ రాగా అప్పటికే ఇంటి పక్కల వారు గమనించి మహిళను లాగి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా తల్లి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

యవకుడిపై

కేసు నమోదు

మిడ్జిల్‌: మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైగింక దాడికి పాల్పడిన యువకుడు వినోద్‌కుమార్‌పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement