అసలు వదిలేసి.. కొసరుతో సరి | - | Sakshi
Sakshi News home page

అసలు వదిలేసి.. కొసరుతో సరి

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

గుప్తనిధుల వ్యవహారంలో బంగారం మాయం

వెండి నాణేలతో సరిపెట్టుకున్న వైనం

బంగారం స్వాహాలో నాయకుల చేతివాటం

గట్టు: గట్టులో లభించిన గుప్త నిధుల వ్యవహారంలో అసలును వదిలేసి.. చివరికి కొసరుతో సరిపెట్టుకున్నట్లు.. అసలు బంగారాన్ని మాయం చేసి చివరికి వెండి నాణేలను అప్పగించి చేతులు దులుపు కొనే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం 33 నాణేలు, లక్షమాత్రం అందుబాటులో ఉండగా.. వీటితోనే గుప్తనిధుల కేసును గుట్టుగా ముగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గట్టులోని బిచ్చాలపేట మసీదు పక్కనే ఉన్న పునరాతన కట్టడంలో పెద్ద ఎ త్తున బంగారం నిధులు లభించినట్లు సమాచారం. కేజీల్లోనే బంగారం లభించగా.., వాటిని గుట్టుచప్పుడుగా పంచుకుతిన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే బంగారం పంపకాల్లో తేడాలు రావడంతోనే వ్యవహారం బయటకు పొక్కినట్లు సమాచారం. బిచ్చాలపేట గుప్తనిధుల వ్యవహారం మరువక ముందే కొద్ది రోజుల తేడాతో నేతాజీ సర్కిల్‌ దగ్గరలోని పాత ఇంట్లో గుప్త నిధులు దొరికిన వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. ఇక్కడా బంగారంతోపాటు 1882నుంచి 1912 కాలం వరకు చె లామణిలో ఉన్న బ్రిటిష్‌ పాలకులు ముద్రించిన వెండి రూపాయ నాణేలు 72తోపాటు బంగారం కూడా లభించినట్లు తెలిసింది. అయితే బంగారంతోపాటు కొన్ని వెండి నాణేలను విక్రయించి సొ మ్ము చేసుకున్నట్లు తెలిసింది. విషయం కాస్త పత్రికల ద్వారా బయటకు రావడంతో పోలీసులపై ఒత్తిడి పెరగడంతో పాత ఇంటి గోడను కూల్చడానికి వెళ్లిన కూలీలను సదరు ఇంటి యజమాని పిలి చి ప్రశ్నించగా.. 33నాణేలు, లక్ష నగదు మాత్రమే ఇంటి యజమానికి అప్పగించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement