మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో ఎక్స్‌ఆఫీషియో మెంబర్స్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి పలు అంశాలకు కౌన్సిల్‌లో ఆమోదం తెలిపింది. ప్రధానంగా 350 నాన్‌టీచింగ్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించడం, వారికి వివిధ కేడర్‌ల వారీగా వేతనాలు పెంచడం ప్రధాన అంశంగా ఉంది. వీటి తో పాటు పీయూలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల్లో నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్‌లకు పూర్తి స్థాయి ప్రొఫెసర్ హోదా కల్పించనున్నారు. వీరితోపాటు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అసోసియేట్ ప్రొఫెసర్‌గా అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా పీయూలో ఎంఎస్‌ఎన్ రెడ్డి రూ.10కోట్లతో నిర్మించినున్న ఆడిటోరియంకు సంబంధించి భూమి కేటాయింపు తదితర అనుమతులను తీసుకోనున్నారు. అంతేకాకుండా కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో విద్యార్థిపై లైంగిక వేధింపులకు దిగి సస్పెండ్ అయిన ప్రిన్సిపల్‌కు సంబంధించి కూడా కౌన్సిల్‌లో చర్చ జరిగింది. వీటికి సంబంధించి మినిట్ టూ మినిట్ అంశాలపై అనుమతులు రావాల్సి ఉందని పీయూ అధికారులు పేర్కొన్నారు.


