పురాతన నాణేలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

పురాతన నాణేలు స్వాధీనం

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

పురాతన నాణేలు స్వాధీనం

గట్టు: స్థానికంగా నివాసముంటున్న శ్యామ్‌ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో లభించిన గుప్తనిధుల్లో కొన్ని నాణేలను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌, గిర్దావర్‌ రాజు, జీపీఓ గిరి నాణేల గురించి ఆరా తీశారు. తన ఇంటి గోడ మరమ్మతు క్రమంలో కూలీలకు బంగారంతో పాటుగా వెండి నాణేలు లభించిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, ఈ విషయం గురించి కూలీలను పిలిచి విచారించగా 33 వెండి నాణేలు, కొంత బంగారం, రూ.లక్ష నగదును అందజేసినట్లు శ్యామ్‌ అధికారులకు తెలియజేశాడు. అనంతరం అధికారులు పంచనామా నిర్వహించి నాణేలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement